సర్వమత సమ్మేళనంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

94
mp santhosh
- Advertisement -

“మనిషి పుట్టక ముందు అన్నీ నేర్చుకొని పుట్టరు. ఎవ్వరం ఎట్ల పుట్టాలో, ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకోలేం, కానీ ఎట్లా బ్రతకాల్నో మన చేతుల్లోనే ఉందంటారు” తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు. అందరు కలిసి మెలిసి జీవించే అద్భుతమైన గంగా జమునా తెహజీబ్ కి ప్రతీక మన తెలంగాణ, దీన్ని నిలబెట్టుకోవాలని కేసిఆర్ గారు నిత్యం చెప్తుంటారు. పండగల నుంచి మొదలు కుంటే ప్రకృతిని సంరక్షించుకునే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దాక ఆ మాటను నిత్యం నిజం చేస్తూనే ఉన్నారు తెలంగాణ బిడ్డలు.

ఇవ్వలా బోరబండలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం గంగా జమునా తెహజీబ్ కి ప్రతీరూపంగా నిలిచింది. బోరబండలోని అన్నీ మతాల ప్రజలు రామాలయంలో జమ్మి మొక్కను, మస్జీద్ లో రేగు మొక్కను, చర్చిలో క్రిస్మస్ ట్రీని నాటారు. అనంతరం, రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. “సర్వమతాల సమ్మేళనం మన హైదరాబాద్” పీర్ల పండగకు హిందువులు దస్తీ కడతరు, హిందువుల పండగలకు ముస్లీంలు దట్టీలు కడతరు. క్రీస్మస్ కి అందరు కలిసి మెలిసి స్వీట్లు పంచుకుంటరు. ఈ అపురూపమైన గంగా జమునా తెహజీబ్ తెలంగాణకే వన్నె తెచ్చింది. ఈ సోదర సంస్కృతికి మనందరం గర్వించాలని ఆకాంక్షించారు. మనం చేసే ప్రతీ పనిలో మన సంస్కృతిని భాగం చేయాలనే తలంపుతో ఇవ్వాల అన్ని మాతాల ఆలయాల్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను భాగం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.

అనంతరం, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం అద్భుతమైనది. మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారం. అంతేకాదు, నిస్వార్ధంగా కార్బన్ డైయాక్సైడ్ ను తీసుకొని ఆక్సీజన్ ను జీవరాశికి అందిస్తాయి. అట్లాంటి చెట్లను మనిషి తన స్వార్ధం కోసం కొట్టేస్తున్నడు. దీన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులుకరుణాకర రెడ్డి రాఘవ, కిషోర్ తో పాటు స్థానిక నాయకులు, మత పెద్దలుపాల్గొన్నారు.

- Advertisement -