స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న మూవీ గుంటూరు కారం. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌పై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఇతర భాషల్లో రిలీజ్ చేయడం లేదని, ఒక తెలుగులో మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా ఏడు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ కి కూడా రెడీ అయింది.
కొత్త షెడ్యూల్ కోసం లొకేషన్ ను ఫైనల్ చేశారు. ముంబైలో ఈ నెల 15వ తేదీ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ముంబైలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో మహేష్ బాబు – హీరోయిన్ మీనాక్షి చౌదరి పై కొన్ని లవ్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని టాక్. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోందట. ఆమెది బాగా నెగిటివ్ క్యారెక్టర్ అని, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుందని తెలుస్తోంది. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు బిజినెస్ మెన్ గా కనిపించనున్నాడు.
Also Read:నేటి నుండే సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
ఇప్పటికే, టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అయితే, గుంటూరు కారం సినిమాతో బాలీవుడ్ లో కూడా మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. అయితే, గుంటూరు కారం సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఏమీ లేదు. కాకపోతే, ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట. అందుకే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడట.
Also Read:ఆకలి వేయట్లేదా.. ఇలా చేయండి !