KTR:త్వరలో మళ్లీ పెన్షన్ పెంపు

36
- Advertisement -

సీఎం కేసీఆర్ త్వరలోనే మళ్లీ పెన్షన్ పెంపుపై ప్రకటన చేయనున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. వరంగల్, హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్…మంచినీళ్ల కోసం ఆనాడు పడిన అగచాట్లు ఇప్పటికీ మరువలేం. బిందెలు పట్టుకొని మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. కనీసం నీళ్లు ఇయ్యలేని కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్క చాన్స్ అని అడుగుతోంది. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్‎కు 11 చాన్సులిచ్చాం అన్నారు.

అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు చేస్తారా? గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనేవారు.. నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారు. తెలంగాణలోనే 24 అంతస్తుల ఆస్పత్రి వరంగల్‎లో సిద్ధం అవుతోంది. ఒకప్పుడు జూనియర్ కాలేజీ కోసం పడరానిపాట్లు పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది. ఆడపిల్లల పెళ్లికి లక్షా నూటా పదహారు రూపాయలు ఇస్తుంది నిజం కాదా? ఆ ఆడపిల్ల ప్రసూతికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదా. వృద్ధులకు కాంగ్రెస్ హయాంలో రూ. 200 ఉన్న పెన్షన్.. కేసీఆర్ వచ్చిన తర్వాత రూ. 2 వేలు అయింది. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వస్తే.. ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నాయన్నారు.

Also Read:నేటి నుండే సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభం

మీ మనసులో మాట కేసీఆర్‎కు తెలుసు. త్వరలోనే పెన్షన్ పెంచే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటన చేయబోతున్నారు. వరంగల్‎లో కూడా ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు పోటీ ఎవరెవరికి జరుగుతుందో తెలుసా? చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఓ వైపు.. తెలంగాణకు ఏమీ ఇయ్యని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓ వైపు. మోడీ దేవుడని ఓ బీజేపీ నాయకుడు అంటున్నాడు. రూ. 400 ఉన్న సిలిండర్‎ను రూ. 1200 చేశాడు. గ్యాస్ ధర పెంచినందుకా మోడీ దేవుడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా మోడీ దేవుడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నడు.. ఎవరికైనా ఇచ్చాడా? జన్ దన్ ద్వారా రూ. 15 లక్షలు ఇస్తా అన్నాడు.. ఎవరికైనా ఇచ్చాడా? అవి వచ్చిన వాళ్లందరూ వాళ్లకే ఓటేయండి. బీఆర్ఎస్ పథకాలు అందుకున్న వాళ్లు మాత్రం మాకు ఓటేయండి. కాంగ్రెస్, బీజేపీలు టికెట్లు ఢిల్లీలో ఇస్తాయి. వాళ్లు బాత్రూం పోవాలన్నా.. అనుమతి కావాల్సిందే. అటువంటి బానిసలు మనకు అవసరమా? మన మొనగాడు మన కేసీఆర్ మన దగ్గరే ఉన్నారని చెప్పారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ వాళ్లు అంటారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా.. మేం ఢిల్లీ గులాంలం కాదు.. గుజరాత్ గులాంలం కాదు. మేం ఎవ్వనికి భయపడం, ఎవనికి బీం టీం కాదు. మేం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారులం. మేం తెలంగాణ ప్రజల టీం మాత్రమే. మీరు ఢిల్లీకి భయపడతారు, సలాం కొడతారు. గుజరాత్‎కి గులాంగిరి చేస్తరు. మాకు ఆ ఖర్మ పట్టలేదు. మాకు మా తెలంగాణ గల్లీల్లో ఉండే అక్కా తమ్ముళ్లే మా బాస్‎లు అని స్పష్టం చేశారు.

- Advertisement -