బోయపాటితో పవన్ కళ్యాణ్‌ సినిమా…రూ.40కోట్లు ఆఫర్ చేసిన బండ్ల గణేశ్

332
Pawan Kalyan Bandla Ganesh
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సినిమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే . జనసేన పార్టీ స్ధాపించి ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్ధానాల్లో ఓటమి పాలయ్యారు. ఇక జనసేన పార్టీ నుంచి కేవలం ఒక అభ్యర్ధి మాత్రమే విజయం సాధించారు. ఇక మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడంతో పవన్ తిరిగి సినిమాల్లోకి రానున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ కు పవన్ కళ్యాణ్‌ అంటే ఎంతో అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బండ్ల గణేశ్ త్వరలోనే పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఆల్రెడి బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్‌ తో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ఇక ఈసినిమా చేస్తే పవన్ కళ్యాన్‌ కు ఏకంగా రూ.40కోట్ల ఆఫర్ చేశాడట బండ్ల గణేశ్. ఇక దర్శకుడిగా బోయపాటి శ్రీనును కూడా సెట్ చేశాడని తెలుస్తుంది.

ఇందుకు బోయపాటికి రూ.10కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి కథ సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో బండ్ల గణేశ్ ఈసినిమాను తెరకెక్కించనున్నారట. బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వార్తల్లో వాస్తవమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -