మొక్కలు నాటిన నిర్మాత అశ్వినిదత్

365
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భతంగా కొనసాగుతుంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఏపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు విసిరిన సవాల్ ను స్వీకరించారు ప్రముఖ నిర్మాత అశ్వినిదత్. గచ్చిబౌలిలోని తన నివాసంలో కూతురు ప్రియంక దత్ తో పాటు మనవడు రిసి కార్తికేయతో కలిసి మొక్కలు నాటారు.

ashwini duth

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జబ్బులకు ,కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలన్నారు. ఇలాంటి కార్యక్రమన్ని ప్రారంభించిన ఎంపీ సంతొష్ కుమార్ ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మరికొంత మందికి సవాల్ విసిరారు. హీరో నాని, హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు కె.రాఘవేంద్రా రావు,కాకినాడ పోర్ట్ చైర్మన్ కె వి రావు,డాక్టర్ జయంతి లకు మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

ashwini

- Advertisement -