పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను అతిగా ప్రేమించే వారిలో స్టార్ ప్రోడ్యూసర్ బండ్ల గణేశ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిచింది. పవన్ కళ్యాణ్ పై ఎవరు కామెంట్లు చేసినా అట్టే కౌంటర్ వేస్తాడు నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు తన ట్వీట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్యే రేణు దేశాయ్ కి వేరే వారితో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
ఎంగేజ్ మెంట్ జరిగిన ఫోటోలు రేణు దేశాయ్ తన ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పలువురు ఆమెకు విషెస్ కూడా చెబుతోన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన మాజీ భార్య రేణూ దేశాయ్ కి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. కుమారి రేణు గారు… సంతోషం కోసం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని నేను భగవంతుడిని, ప్రకృతీమాతను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
ఇక పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై స్పందిచారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. ‘దిస్ ఈజ్ మై బాస్ పవన్ కల్యాణ్ అని పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ కు రీ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ రేణూ కు విషెస్ చెప్పడం అద్భతుమంటూ కామెంట్ చేశారు. తన బాస్ పవన్ కళ్యాణ్ అంటే అంతే మరి అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ కాగా ఆయనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.
This is my boss @PawanKalyan 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻 pic.twitter.com/sgEKqdiGVs
— BANDLA GANESH. (@ganeshbandla) June 26, 2018