మరోసారి ఏఎన్నార్‌గా చైతూ..!

188
nagachaitanya

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్. లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 3 నెలల గడిచిన షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ప్రస్తుతం స్క్రీన్ ప్లే,స్టోరీ మార్పు చేర్పులతో బిజీగా ఉన్న క్రిష్ జూలై 5 నుంచి ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ మొదలుకానుంది.

ఇక ఈ సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఏ చిన్న వార్తైన టీ టౌన్‌లో చక్కర్లు కొడుతునే ఉంది. ఈ సినిమాలో నాదెండ్ల భాస్కరరావు పాత్రను బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడని వార్తలు వెలువడుతుండగానే మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో షికార్ చేస్తోంది.

ఇటీవల విడుదలైన ‘మహానటి’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రను ధరించి అందరినీ మెప్పించాడు నాగచైతన్య. ఇప్పుడు మళ్లీ చైతూ నాగేశ్వరరావుగారి పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఏఎన్నార్‌ పాత్ర కోసం చైతన్యని సంప్రదించాలని భావిస్తున్నారట దర్శకుడు క్రిష్. మరి క్రిష్ ఆఫర్ కు చైతన్య ఒప్పుకుని మరోసారి తాతగారి పాత్రలో అలరిస్తారో లేదో చూడాలి. సంక్రాంతి కానుక‌గా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Related image