మరోసారి ప్రియాంకకు కరోనా!

69
priyanka
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడగా తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

స్వల్ప లక్షణాలతో టెస్టు చేయించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని …స్వల్ప లక్షణాలు ఉన్నాయని అన్ని నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నానని తెలపిఆరు.

గత జూన్ లో కరోనా బారిన పడ్డారు ప్రియాంక. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కరోనా సోకడం గమనార్హం. మరోవైపు రాహుల్ గాంధీ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇవాళ్టి రాజస్థాన్ పర్యటనను ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు.

- Advertisement -