బింబిసార…ఐదు రోజుల వసూళ్లు ఎంతో తెలుసా?

91
bimbisara
- Advertisement -

వశిష్ట దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం బింబిసార. కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పంట పండించగా 5 రోజుల్లో 20 కోట్ల షేర్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల బిజినెస్ రాబట్టి లాభాలతో దూసుకెళ్తోంది. ఇక ఐదో రోజు కలెక్షన్స్‌ని పరిశీలిస్తే…

నైజాంలో 89 లక్షలు, వైజాగ్ – 37 లక్షలు ,సీడెడ్ – 62 లక్షలు,కృష్ణ – 13.2 లక్షలు, గుంటూరు – 17 లక్షలు, నెల్లూరు – 6 లక్షలు, తూర్పు గోదావరి – 15 లక్షలు, పశ్చిమ గోదావరి – 11 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా 5వ రోజు 2.44 కోట్ల షేర్ రాబట్టింది.

- Advertisement -