‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికా చేరుకుంది. ఆస్కార్ సౌత్ ఆసియా నామినీలకు అమెరికాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్, ప్రీతి జింటా హాజరయ్యారు. ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.
అలాగే ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అమెరికా వెళ్లారు. లాస్ ఏంజిల్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిసిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘నాకు అత్యంత ఇష్టమైన నటుడు, డౌన్ టు ఎర్త్ వ్యక్తి ఎన్టీఆర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ బిడ్డ ప్రపంచ వేదికపై పర్ఫామెన్స్ ఇస్తుండటం ఎంతో గర్వకారణం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆస్కార్ అవార్డుల ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నాటు నాటు సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది. కానీ, ఈ పాట కోసం చాలా కష్టపడ్డాం. వారం రోజుల ముందే ప్రాక్టీస్ మొదలుపెట్టాం. ఇద్దరి డ్యాన్స్ సింక్ అయ్యేందుకు రోజూ 3 గంటలు ప్రాక్టీస్ చేశాం. దీంతో ఇప్పటికీ నా కాళ్లు నొప్పిపెడుతుంటాయ్’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
https://www.instagram.com/p/Cpn_XwgSjiE/?hl=en
ఇవి కూడా చదవండి…