ప్రియాంక గాంధీ ఇకపై సౌత్ లోనే?

33
- Advertisement -

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇకపై సౌత్ కె పరిమితం కానున్నారా ? అదే దృష్టంతా సౌత్ రాష్ట్రాలపైనే ఉందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రచార ల్లోనూ, వివిధ కార్యక్రమాల్లోనూ తనదైన ముద్రా వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సౌత్ లో కర్నాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేసిన ప్రచార కార్యక్రమాలు కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. ఇక పోతే మరో నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. .

అందులో భాగంగానే నార్త్ లో రాహుల్ గాంధీ, సౌత్ లో ప్రియాంక గాంధీ ఫోకస్ చేయబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా యూపీ ఇన్ చార్జ్ బాద్యత నుంచి ప్రియాంక గాంధీని తప్పించింది అధిష్టానం. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి పోర్ట్ ఫోలియో కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తే ఆమె సౌత్ రాష్ట్రాల పై ఫోకస్ చేయడం కోసమే నార్త్ లో ఎలాంటి బాధ్యత చేపట్టడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతలు ఆమెనే నిర్వర్తించే అవకాశం లేకపోలేదు. సౌత్ రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ ఎంట్రీతో హస్తం పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రియాంక గాంధీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:చేవెళ్లపై గులాబీ జెండా ఎగరాలి

- Advertisement -