వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు ప్రియాంక. ఓట్ల లెక్కింపు ఫలితాల్లో బ్యాలెట్ ఓట్లు మొదలుకుని ఆఖరి రౌండ్ వరకు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయాన్ని నమోదు చేశారు ప్రియాంక.
2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ …3,64,653 ఓట్ల ఆధిక్యం పొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాకు 2,83,023 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌కు 1,41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాహుల్ గాంధీ సాధించిన 3.65 లక్షల ఓట్ల రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంక గాంధీ 4 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించింది. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రాబర్ట్ వాద్రా. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని తెలుసు. ప్రజల సస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తారు అన్నారు.
Also Read:కాంగ్రెస్ అబద్దాలను కడిగేసిన కాగ్