సినీ సెలెబ్రిటీల ఆగడాలకు ఒక్కోసారి హద్దులు లేకుండాపోతున్నాయి. వీరు ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ లుక్ ఉండేలా ట్రై చేస్తుంటారు.
కానీ వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నారు? అలాంటి సందర్భాల్లో ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనే లాజిక్ ని కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి లాజిక్స్ నే మిస్సవుతోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.
గతంలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశానికి పొట్టి వస్త్రాలతో వెళ్ళడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రియాంకపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. భారత సంప్రదాయం ప్రకారం చీర గానీ, చుడీదార్ గానీ వేసుకుంటే ఏమైందని నెటిజన్లు ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు.
ఇంతకీ ప్రియాంక ఏం చేసిందో తెలుసా..? భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో జీన్స్, స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని త్రివర్ణంలో ఉన్న చున్నీని ప్రియాంక గాల్లో ఆడిస్తున్నట్లుగా ఉంది.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. `కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజునైనా చీర కట్టుకోవచ్చు కదా!`, `భారత్ పరువు తీశావ్! ఇక నువ్వు ఇక్కడికి రావొద్దు` అంటూ కామెంట్ చేశారు. అయితే కొంతమంది మాత్రం `తన లైఫ్ తనిష్టం`, `నెగెటివ్ కామెంట్లు చేయకండి` అంటూ ప్రియాంకకు మద్దతిచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్టులకు సెలవు పెట్టి రెండు వారాల పాటు ముంబైలో గడిపేందుకు ఇండియా వచ్చింది.