బందూక్ బాజ్….ఆ సీన్లు ఉంటాయి..!

181
censor
- Advertisement -

బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో ఎక్కువగా శృంగార భరిత చిత్రాలే వస్తున్నాయి. సినిమా ఎలాంటిదైనా సరే అందులో బెడ్ రూమ్,బాత్ రూమ్ సీన్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు, శరీరాన్ని ఎక్కడపడితే అక్కడ తాకేలా రెచ్చిపోవడం ఇలా కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా నవాజుద్దీన్ సిద్దికీ,అర్మాన్ మాలిక్ నటించిన చిత్రం బాబూ మోషయ్ బందూక్ బాజ్.

ఇప్పుడీ సినిమా బీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కారణం విపరీతంగా బూతు కంటెంట్ ఉండటమే. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆ సీన్లను దట్టంగా వడ్డించారట. అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ సినిమాకి 48 సెన్సార్‌ కట్స్‌ పడ్డాయట.

సెన్సార్ బోర్డు నిర్ణయంతో షాకైన  చిత్ర దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది. సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే సూచించటం విశేషం.

తొలుత నవాజ్‌కి జోడీగా చిత్రాంగద సింగ్‌ను తీసుకున్నారు. కానీ ఇందులో అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో బీ టౌన్‌ షేకవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

- Advertisement -