బాలీవుడ్లో సత్తాచాటిన ప్రియాంక చోప్రా హలీవుడ్లో సైతం పాగావేసింది. తన అందచందాలను ఆరబోస్తోంది. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్ షోను ప్రదర్శిస్తోంది. అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైపోయింది. హాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తుండడంతో అమెరికాలోనే ప్రియాంక చోప్రా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హాలీవుడ్ వెళ్లిన తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందాల డోస్‌లో బోలెడంత మార్పులు వచ్చేసింది. మెయింటెనెన్స్ లో మాత్రమే కాదు.. ఎగ్జిబిషన్ లోనూ బోలెడంత డిఫరెన్స్ చూపిస్తోంది ఈ బ్యూటీ. ఏ గ్లామర్ ఈవెంట్ లో అయినా సరే ప్రియాంక అందాల విందు హాట్ టాపిక్ అయిపోతోంది.
తాజాగా పారిస్ కోచర్ ఫ్యాషన్ వీక్ కు పిగ్గీ ఛాప్స్ హాజరైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మడి కాస్ట్యూమ్స్ గ్లామర్ షో అమేజింగ్ అనిపించేశాయి. పెద్దగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా ప్రియాంక ఇక్కడ హాట్ టాపిక్ అయిపోయింది. మోకాళ్లకు పై వరకూ ఉండే వైట్ కలర్ డ్రెస్ వేసుకుని.. ప్రియాంక చూపిన గ్లామ్ సూపర్బ్ అనిపించేసింది. బ్లాక్ కలర్ లో ఉన్న యాంకిల్ బూట్స్.. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఉన్న మ్యాచింగ్ పర్స్ తో పీసీ చేసిన సందడి మామూలుగా లేదు.
ట్రెండీగా ఉండే డ్రస్సులు వేయడం సెలబ్రిటీ భామలు అందరూ చేసే పనే. కానీ ట్రెండ్ ను సృష్టించే డ్రెసింగ్ కొందరికే సాధ్యమయ్యే విద్య. ఈ విషయంలో ప్రియాంక ఎప్పుడో ఆరితేరిపోయింది కానీ ఇప్పుడు మరింతగా తన ట్యాలెంట్ చూపించేస్తోంది. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. బేవాచ్ తర్వాతి ప్రాజెక్టును ఇంకా ప్రారంభించాల్సి ఉంది.