కేంద్రం డబ్బులతోనే వైసీపీ పాలన!

7
- Advertisement -

జగనన్న కాలనీల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శాసనసభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. కేంద్రం డబ్బులతోనే కథ నడిపారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు.

మేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి అన్నారు. చంద్రబాబు మాటలు కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నారు అన్నారు అచ్చెన్నాయుడు.

Also Read:సీఎం రేవంత్‌కు 10 వేల పోస్టు కార్డులు: కవిత

మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు. మా పార్టీకి మీలాగా రంగుల పిచ్చ లేదు. మా ప్రభుత్వానికి పేదవారు మాత్రమే ప్రామాణికం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వస్తాయి. ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకపోయినా మా దృష్టికి తీసుకు రండి అని సూచించారు.

- Advertisement -