ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ‘ఒరు ఆదార్ లవ్’లోని ‘మాణిక్య మలయార పూవి’ పాటతో ఒక్కరోజులోనే ప్రియ ఫేమస్ అయిపోయింది. ఇప్పటికే ప్రియాకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఈ కెరళకుట్టికి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. అందుకు భారీ మొత్తాన్ని ఇవ్వడానికిసైతం వెనకాడట్లేదు కొన్ని కంపెనీలు.
తమ ఉత్పత్తులకు ప్రచారం చేసిపెట్టాలని, ఇందుకు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పుతామని ఆమెకు ఆఫర్ ఇస్తున్నాయట.
ప్రియా తన ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే రూ.8 లక్షల వరకు ఇస్తామంటూ ఆమెకు పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్లు టాక్. తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అతి తక్కువ సమయంలోనే 5.8 మిలియన్లను దాటేసింది. తాను నటించిన తొలి చిత్రం ఒరు అదార్ లవ్ ఈ జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.