అందుకే సినిమాలు చెయ్యను : ప్రియా

202
priya prakash varrier sensational comments
- Advertisement -

ఒక్క చిన్న టీజర్ తో మిలియన్ల కొద్ది ఫాలోయర్స్ ను సంపాదించుకున్న లేడీ..ప్రియా ప్రకాశ్ వారియర్‌. అసలు ఇంతటి ఫాలోయర్స్‌ని సంపాధించుకోవడమంటే మామూలు విషయంకాదు. ఒరు ఆదార్ లవ్ అనే మలయాళం సినిమాలో ప్రియా కనుబొమ్మల సయ్యాటలోతో యూత్‌ని ఫిదా చేసింది. నిజానికి ప్రియా వారియర్ హీరొయిన్ కాదు.

తనది సపోర్టింగ్ రోల్. కాని తన లుక్స్- యాక్టింగ్ లో మేజిక్ గమనించిన దర్శకుడు ఒమర్ లుల్లు తను కూడా హై లైట్ అయ్యేలా టీజర్ కట్ చేయించాడు. అది కాస్త సెన్సేషన్ గా మారి ఇటీవలే విడుదలైన మరో టీజర్ కూడా అంతే స్థాయిలో స్పందన దక్కించుకుంటోంది ప్రియా.

    priya prakash varrier sensational comments

ఇదిలా ఉంటే..ఒరు ఆదార్ లవ్ విడుదల కాకుండానే ఈ కెరళ కుట్టికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇమేజ్ వచ్చిన చోట ఆఫర్లు రావడం అంటే బెల్లం చుట్టూ చీమలు ముసిరినంత సహజం. ప్రియా ప్రకాష్ కు కూడా ఇది అనుభవమవుతోంది. బాలీవుడ్ వృద్ధ హీరో రిషి కపూర్ అంతటి వాడే పిల్లా నువ్వు మా తరంలో ఎందుకు పుట్టలేదు అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు అంటేనే తన రేంజ్ అర్థమవుతుంది.

కాని ప్రియా వారియర్ తొందరపడటం లేదు. ఈ రెస్పాన్స్ పుణ్యమా అని ఒరు ఆదార్ లవ్ లో తన పాత్ర పరిధి పెరిగిందని. కాని ఇప్పటికిప్పుడు తాను ఏ సినిమాను ఒప్పుకోనని క్లారిటీ గా చెప్పేస్తోంది. ఆగష్టులో ఈ మొదటి సినిమా రిలీజ్ అయ్యాకే నిర్ణయం తీసుకుంటాను అని చెబుతోంది.

    priya prakash varrier sensational comments

డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ప్రియాకి ఊహించనంత పాపులారిటీ రావడంతో ఇంటికి మీడియా ప్రతినిధుల తాకిడి ఎక్కువవుతోంది. దాంతో తల్లి ఇంటి నుంచి హాస్టల్ కు షిఫ్ట్ చేసింది. మొత్తానికి ఒరు ఆదార్ లవ్ ఘన విజయం సాధించాక అప్పుడు మార్కెట్ ను బట్టి కొత్త సినిమాలు పారితోషికం గురించి డిసైడ్ అవ్వాలనేది ప్రియా ప్లానట.

- Advertisement -