నాని మూవీలో ప్రియా వారియ‌ర్?

232
nani Priya Warrier
- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ మూవీలో బిజీగా ఉన్నాడు. మ‌ళ్ళీరావా ఫేమ్ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈచిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత నాని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు.

Priya prakash Nani

విక్ర‌మ్ కుమార్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నిలో బిజీగా ఉన్నాడు. వ‌చ్చే నెల 19 నుంచి ఈచిత్రం రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు తెలిపారు చిత్ర యూనిట్. అయితే ఈసినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్ల‌కు అవ‌కాశం ఉంద‌ట‌. అందులో ఒక పాత్ర కోసం మ‌ల‌యాళ ముద్ద‌గుమ్మ ప్రియా వారియ‌ర్ ను తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్.

vikram k kumar nani

చిత్ర‌బృందం ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. ప్రియా వారియ‌ర్ కు దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండ‌టంతో సినిమాకు మ‌రింత క్రేజ్ ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు చిత్ర‌యూనిట్. ప్రియా ప్ర‌కాశ్ న‌టించిన ఓరు ఆదార్ ల‌వ్ మూవీ ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది. తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -