ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, జే సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి తదితరులు రాజ్యసభలో ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటన తెలంగాణ ప్రజలను అవమానించడమే తప్ప మరొకటి కాదన్నారు. దీనిపై చర్చ జరపాలని ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి చర్చలు లేకుండానే కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసేసి రాష్ట్రాలను విభజించిన తీరు పూర్తిగా తప్పు అని, అందుకే రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని మోదీ పేర్కొన్నారు.
మోడీ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. పార్లమెంట్‌లో మోదీ చేసిన ప్రకటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు.