మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

2
- Advertisement -

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ మేరయు ముజువాణి ఓటుతో లోక్ సభ అమోదం తెలిపింది. మణిపూర్‌ రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356(1)కింద రాష్ట్రపతి ఫిబ్రవరి 13,2025న జారీ చేసిన ప్రకటనపై పరిశీలన చేపట్టింది.

మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. గత నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని, శాంతియుత పరిష్కారం కోసం మైతీ, కుకీ కమ్యూనిటీలతో చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు.

దశాబ్దకాలం పాటు మణిపూర్‌లో హింస కొనసాగిందని, 750 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 1997-98లో కుకీ -పెయిటే ఘర్షణల్లో 352 మంది మరణించారని, 1990లో మైతీ -పంగల్‌ ఘర్షణల్లో 100మందికి పైగా మరణించారని అన్నారు.

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిపై శివసేన (ఠాక్రే) ఎంపి అరవింద్‌ సావంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంచిదికాదనిఎన్‌సిపి (శరద్‌పవార్‌) నేత సుప్రియా సూలే పేర్కొన్నారు.

Also Read:హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ..రెడ్ జోన్ ప్రాంతాలివే

- Advertisement -