నిర్భయ దోషి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి..

438
President
- Advertisement -

నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీరు ప్రకారం దోషులకు ఈ నెల 22న ఉరి తీయనున్నారు. అయితే ఈ కేసు దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ మంగళవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు.

ఈ పిటీషన్‌ పరిశీలించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ పిటిషన్ ను రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ పంపించింది. దీంతోపాటే, నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్షపెట్టవద్దని రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు.

Nirbhaya Convicts

దీంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో అధికారులు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఉరిశిక్ష కోర్టు తీర్పు ప్రకారం జనవరి 22న అమల అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -