బన్నీ- మహేష్.. నాన్ బాహుబలి రికార్డు..!

438
mahesh and bunny
- Advertisement -

సంక్రాంతి సందర్భంగా విడుదలైన అల్లు అర్జున్ లేటెస్ట్‌ మూవీ ‘అల వైకుంఠపురములో..’ ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టి, కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ కావడం అలాగే చిత్ర కథాంశం ప్రేక్షకులకు నచ్చడంతో పాటు బన్నీ డ్యాన్సులు, యాక్షన్ సీన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మహేష్‌ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా భారీ విజయాన్ని అందుకుంది.

sarileru

తాజాగా ప్రచారంలోకి వచ్చిన కలెక్షన్స్ ను పరిశీలిస్తే ‘అల వైకుంఠపురములో’ సినిమా నైజామ్, వైజాగ్, కృష్ణ, ఈస్ట్, వెస్ట్, సీడెడ్, నెల్లూరు, గుంటూరులో నాలుగు రోజుల కలెక్షన్లతో నాన్ బాహుబలి 2 రికార్డ్ సృష్టించిందని అంటున్నారు. 7 టెరిటరీలలో నాన్ బాహుబలి రికార్డ్ అని అంటున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ 5 రోజుల కలెక్షన్స్ లో ఇలాంటి రికార్డులే ఉన్నాయని అంటున్నారు. నైజామ్, ఈస్ట్, నెల్లూరు నాన్ బాహుబలి 2 రికార్డ్ అని.. వెస్ట్ లో ఆల్ టైమ్ రికార్డ్ అని.. ఈస్ట్, గుంటూరు, వైజాగ్ లో బ్రేక్ ఈవెన్ అయిందని అంటున్నారు.

- Advertisement -