కథువా ఘటన సిగ్గుపడాల్సిన చర్య..

207
President Ramnath says it is shameful
- Advertisement -

దేశంలో కతువా ఘటనల వంటి సంఘటనలు పునరావృతం కావొద్దని..ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. జమ్ము కశ్మీర్‌లోని కట్రాలోని శ్రీమాతా వైష్ణవో దేవి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడిన కోవింద్..మహిళలపై అకృత్యాలు జరగకుండా సమసమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇటువంటి తరుణంలో వారిపై అఘాయిత్యాలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలన్నారు. ఇకపై ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడా జరగకుండా చూసుకోవాలని ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్య. దీనికి చరమగీతం పాడాలి అని అన్నారు.

Kovind

చిన్నారుల పట్ల అంత కర్కశంగా ఎలా ప్రవర్తించగలరు? పిల్లలు సాక్షాత్తూ వైష్ణోదేవి ప్రతిరూపాలు,,. ఇలాంటి పసిమొగ్గలపై ప్రతాపం చూపడం ఎంతమాత్రం సరికాదని జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.

- Advertisement -