ఆదిత్య మ్యూజిక్‌తో ‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ ఆడియో..

360
Ammamma Gari Illu Adiuo!
- Advertisement -

హీరో నాగశౌర్య ఇటివల ‘చలో’ సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా ఒకప్పుడు బాలనటిగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొన్న బేబి షామిలి నటిస్తోంది. ఈ మూవీని శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో రాజేష్ మ‌రియు కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Ammamma Gari Illu Adiuo!

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ` చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌లే సినిమా శాటిలైట్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. తాజాగా ఆడియో హ‌క్కుల‌ను ఆదిత్య మ్యూజిక్ ద‌క్కించుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత గా పెరుగుతున్నాయి.

ఈనెల 22న టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి హీరో నాగ శౌర్య , హీరోయిన్ షామిలితో పాటు, మిగ‌తా టీమ్ స‌భ్యులంతా హ‌జ‌రు కానున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అని అన్నారు.

- Advertisement -