హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము..

45
- Advertisement -

ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు రాష్ట్రపతి.

ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. సాయంత్రం 5గంటలకు హెలికాప్టర్ ద్వారా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు.అక్కడ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.

Also Read:కాంగ్రెస్‌ను నమ్మితే కల్లోలమే..?

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Also Read:చంద్రబాబు పవన్ మధ్య క్లాష్..తప్పదా?

- Advertisement -