- Advertisement -
ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్ లో భారతీయ కళా మహోత్సవం ప్రారంభించనున్నారు ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు రాష్ట్రపతి.
గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు స్వాగతం పలకనున్నారు. సా. 4 నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొననున్నారు రాష్ట్రపతి. రాత్రి రాజ్ భవన్ లో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు.
22వ తేదీ ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరనున్నారు రాష్ట్రపతి.
Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్
- Advertisement -

