Nikhat Zareen:నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం

7
- Advertisement -

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ లో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్‌ 5-0తో గవో యీ గ్జువాన్‌ ని చిత్తు చేసింది. తొలి రౌండ్‌ నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన నిఖత్‌.. పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. ఆఖరిదాకా అదే జోరు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో ప్రపంచ కప్ బాక్సింగ్ లో భారత్ ఖాతాలో ఎనిమిది పసిడి పతకాలు చేరాయి. రజతాల విషయానికి వస్తే.. 50 కేజీల విభాగంలో జాదుమణి సింగ్‌ , 80 కేజీల దాంట్లో అంకుశ్‌, 55 కేజీల విభాంగలో పవన్‌ , 65 కేజీల విభాగంలో అబినాష్‌ , 80 కేజీల విభాగంలో పూజ రాణి ఫైనల్లో ఓడి రజతాలను దక్కించుకున్నారు.

మొత్తంగా 20 పతకాలు (9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) గెలిచిన భారత్‌ అగ్రస్థానంతో టోర్నీని ముగించింది.

Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

- Advertisement -