హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

38
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల హైదరాబాదు పర్యటన కోసం ఇవాళ సా. 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు.

రేపు ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ ఎయిర్ ఫోర్స్ పరేడ్ అటెండయిన తరవాత ఉదయం 11:15 నిమిషాలకి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Also Read:తీరం దాటిన బిపర్‌జాయ్‌..

పరేడ్ శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకలో అనేక విమానాల విన్యాసాలు కూడా జరగనున్నాయి.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిచారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సీటీవో జంక్షన్, బేగంపేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, , పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్లలో ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉండనున్నాయి.

Also Read:ఇలా చేస్తే ఎంతటి పొట్ట అయిన మటుమాయం.. !

- Advertisement -