నేడు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్!

52
president
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుండగా మొదట ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. తర్వాత రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువనున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది.

పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్‌ నమోదు అయింది. బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌తో సహా ఆరుగురు ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేదు.

- Advertisement -