రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల..

122
Election Commission
- Advertisement -

ఢిల్లీలో గురువారం దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ విడుద‌ల చేశారు. ఆయన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. జూన్ 15 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని రాజీవ్ కుమార్ ప్ర‌కటించారు. జూలై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జూలై 18 నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వ‌హిస్తామ‌ని రాజీవ్ కుమార్ తెలిపారు.

ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పద‌వీ కాలం జూలై 24తో ముగియ‌నుంద‌ని, ఈ నేపథ్యంలో జూలై 25లోగా నూత‌న రాష్ట్రప‌తి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంద‌ని తెలిపిన రాజీవ్ కుమార్‌.. అందుక‌నుగుణంగానే షెడ్యూల్‌ను ఖ‌రారు చేశామ‌ని తెలిపారు. నామినేషన్ల ప‌ర్వం, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జ‌ర‌గ‌నుండ‌గా…పోలింగ్ మాత్రం పార్ల‌మెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఆవ‌ర‌ణ‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు.

ముఖ్యమైన తేదీలు:
జూన్ 15న నోటిఫికేషన్.
జూన్ 29 నామినేషన్లకు చివరి తేదీ.
జూన్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన.
జూలై 2 న నామినేషన్ల ఉపసంహరణకు చివారితేది.
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.
జూలై 21న ఓట్ల లెక్కింపు.

- Advertisement -