- Advertisement -
సెప్టెంబర్ 17న లండన్ వెళ్లనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 19న జరిగే ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు ద్రౌపది ముర్ము. భారత ప్రభుత్వం తరపున ఎలిజబెత్ 2అంత్యక్రియల్లో పాల్గొని సంతాపాన్ని తెలియజేయనున్నారు. బ్రిటన్‌లో అర్థశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
క్వీన్ ఎలిజబెత్ 2 మృతి పట్ల సంతాప సూచకంగా సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినాన్ని పాటించింది భారత్. 1926లో జన్మించిన ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8న మరణించారు. బ్రిటన్ ను 70 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు.
- Advertisement -