భారత అత్యున్నత కోర్టు ప్రధాన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 49వ సీజేగా యూ యూ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన లేఖను సీజేఐ కేంద్ర న్యాయ శాఖకు పంపగా.. అక్కడి నుంచి దాన్ని ప్రధాని కార్యాలయానికి పంపారు. పీఎం మోదీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేషీకి వెళ్లింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 49వ సీజేఐగా ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో 27న ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. జస్టిస్ లలిత్ పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. నవంబర్ 8న ఆయన రిటైర్ కానున్నారు. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్ తలాక్‌తో పాటు అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.