మార్చి 13న ‘ప్రేమపిపాసి’విడుదల

391
Premapipasi
- Advertisement -

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’ .పి.ఎస్‌.రామకృష్ణ (ఆర్‌ .కె ) ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మురళీరామస్వామి (ఎమ్‌ ఆర్‌) దర్శకత్వం వహించగా జిపిఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్‌గా నటించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 13న గ్రాండ్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత పి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ… మా సినిమా సెన్సార్‌ పూర్తైంది. ఎ సర్టిఫికెట్‌తో పాటు సెన్సార్‌ వారు సినిమాకు మంచి కాంప్లిమెంట్స్‌ ఇవ్వడంతో సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌ వచ్చింది. మార్చి 13న సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. బిజినెస్ పరంగా అన్ని ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది“ అన్నారు.

కో`ప్రొడ్యూసర్‌ రాహుల్‌ పండిట్‌ మాట్లాడుతూ…మారుతి చేతుల మీదుగా ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్‌తో పాటు మంచి వ్యూస్‌ కూడా వచ్చాయి. ట్రైలర్ సినిమాపై క్రేజ్‌ తీసుకొచ్చింది. అంతకు మించి సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు . మార్చి 13న ప్రేక్షకులు ఇచ్చే తీర్పు కోసం వెయిట్‌ చేస్తున్నాం’’ అన్నారు.

హీరో జిపియస్‌ మాట్లాడుతూ.. ట్రైలర్ రిలీజైన రోజు నుంచి అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ వర్గాల్లో మా సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది . సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారంటూ ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇక సెన్సార్‌ రిపోర్ట్‌తో మా యూనిట్‌ అంతా సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. మార్చి 13న మా సినిమాను చూసి బ్లెస్‌ చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.

డైరక్టర్‌ మురళిరామస్వామి మాట్లాడుతూ… ఎప్పుడైతే మారుతి మా సినిమా ట్రైలర్ రిలీజ్‌ చేసి మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారో…అప్పటి నుంచి సినిమాకు విపరీతమైన హైప్‌ వచ్చింది. ఈ విషయంలో దర్శకుడు మారుతి కి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. అలాగే ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలో మిగతా పాటలను కూడా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇక ఇటీవల మా సినిమాను టెక్నీషియన్స్‌తో పాటు కొంతమంది యూత్‌కి చూపించాం. ప్రతి ఒక్కరూ ‘ ట్రైండ్‌కి అడ్వాన్స్‌డ్‌గా ఉందంటూ’ ప్రశంసించారు. ఇక సెన్సార్‌ వారు కూడా బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. దీంతో మేము ఇన్నాళ్లు పడ్డ శ్రమ తీరిపోయినట్టనిపించింది. మార్చి 13న సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి కూడా ఇలాంటి రెస్పాన్సే వస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు.

- Advertisement -