ట్రెండీగా సాగే ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది..

235
- Advertisement -

ప్రేమ పిపాసి చిత్రంతో టాలీవుడ్‌లో ట్రెండీ డైర‌క్ట‌ర్‌గా గుర్తింపుని తెచ్చుకున్న ముర‌ళి రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో దుర్గశ్రీ ఫిలింస్ సంస్థ ప్రొడ‌క్ష‌న్ నెం-2 చిత్రం పూజ కార్యక్రమాలు అమ‌రావ‌తిలో జరిగాయి. ఈ చిత్రానికి య‌శ్వంత్ రామ‌స్వామి స‌మ‌ర్ప‌ణ. ఈ చిత్రంతో బ‌న్ని, రీతు క‌న్వ‌త్, రోషిని, ప‌ట్టీల శ్రీను మ‌రియు ప్ర‌దీప్ చౌద‌రిలు న‌టీన‌టులుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు ముర‌ళి రామ‌స్వామి మాట్లాడుతూ…ప్రేమ పిపాసి` త‌ర్వాత నా రెండో సినిమా కూడా దుర్గ‌శ్రీ ఫిలింస్ సంస్థ‌లోనే చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అమ‌రావ‌తిలో పూజ కార్యక్రమాలు జరిపాం. చాలా వ‌ర‌కు ఇక్క‌డే షూటింగ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాం. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రియల్ ఇన్సిడెంట్స్‌తో ట్రెండీగా సాగే ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. త్వ‌ర‌లో టైటిల్‌తో పాటు కాస్ట్ అండ్ క్రూ వివరాలు ప్ర‌క‌టిస్తాం అన్నారు.

Prema Pipasi Director New Movie Announced

హీరో బ‌న్ని మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను రియ‌లిస్టిక్‌గా ఉండే క్యార‌క్ట‌ర్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రేమ పిపాసితో డైర‌క్ట‌ర్‌గా రామ‌స్వామి ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో అవ‌కాశం క‌ల్పించిన దుర్గ‌శ్రీ ఫిలింస్ వారికీ, య‌శ్వంత్ రామ‌స్వామికి స్పెష‌ల్ థ్యాంక్స్ అన్నారు.

హీరోయిన్స్ రీతు క‌న్వ‌త్-రోషిణి మాట్లాడుతూ.. ఇందులో నా క్యార‌క్ట‌ర్ చాలా ట్రెండీగా డిజైన్ చేశారు మా ద‌ర్శ‌కుడు రామ‌స్వామి. స్టోరి చాలా బాగుంది. ఒక మంచి మూవీలో న‌న్ను పార్ట్ చేసిన ద‌ర్శ‌కుడు రామ‌స్వామికి, దుర్గ‌శ్రీ ఫిలింస్ వారికి , య‌శ్వంత్ రామ‌స్వామికి ధ‌న్య‌వాదాలు అన్నారు.

న‌టులు ప‌ట్టీల శ్రీను, ప్రదీప్ చౌద‌రి మాట్లాడుతూ.. ముర‌ళి రామ‌స్వామి ఫ‌స్ట్ సినిమాతోనే బెస్ట్ డైర‌క్ట‌ర్ అనిపించుకున్నారు. ఒక మంచి స్టోరితో త‌న రెండో సినిమా చేస్తున్నారు. ఒక మంచి ప్రాజెక్ట్ తో మేము న‌టులుగా ప‌రిచ‌యం కావ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

- Advertisement -