సూర్యగ్రహణం…తీసుకోవాల్సిన జాగ్రత్తలు

236
solar ecilipse
- Advertisement -

ఈ నెల 21న దేశంలో అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆదివారం ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. అయితే, మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది.

ఇదిలా ఉంటే సాధారణంగా గ్రహణాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడటం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.ముఖ్యంగా సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని వారు చెబుతుంటారు. అలాగే రెగ్యులర్ సన్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని వారు సూచిస్తుంటారు.

సూర్యగ్రహణము సంభవించే సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు. నీళ్లు, సూర్య లేదా చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు కంటితో ప్రత్యక్షంగా గ్రహణాన్ని వీక్షించకూడదు. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదు. బయటకు వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుంది.

గ్రహణం సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాకకూడదు. కాగా 16ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలను మూసివేయనుండగా గ్రహణం విడిచాక ఆలయాలు, గృహాలను సంప్రోక్షణ చేసి తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.

- Advertisement -