ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ‘గరుడ వేగ’ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఓ ప్రశ్నకి సమాధానంగా .. సందీప్ కిషన్ కి.. తనకి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పాడు.
“రొటీన్ లవ్ స్టోరీ’కి నేను దర్శకుడిగా వున్నాను .. సందీప్ కిషన్ .. ఆయన ఫ్రెండ్ నిర్మాతలుగా వున్నారు. చివరి నిమిషంలో ఆ ఫ్రెండ్ పక్కకి తప్పుకోవడంతో, ఆ బాధ్యతను నేను స్వీకరించడానికి సిద్ధమయ్యాను” అని అన్నాడు. “ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను ఉత్తరాఖండ్ లో చిత్రీకరించాం. షూటింగ్ కోసం బయటికి వెళ్లినప్పుడు కొంత ఖర్చు పెరగడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా అక్కడ అదనంగా ఓ 15 లక్షలు ఖర్చు చేయవలసి వచ్చింది. బడ్జెట్ ఎక్కువైపోతోందంటూ సందీప్ కిషన్ అసహనాన్ని వ్యక్తం చేయగా .. నేను సర్ది చెప్పాను.
అయినా సందీప్ కిషన్ వినిపించుకోకపోవడంతో మాటా మాట పెరిగింది .. దాంతో ఆయన వాటా వెనక్కి ఇచ్చేశాను. ఇప్పుడు ఇద్దరి మద్య ఫ్రెండ్ షిప్ ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి గరుడ వేగ సినిమా ప్రమోషన్ లో హీరో సందీప్ కిషన్ కు, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కు గొడవ అయిందన్న విషయం బయటపడింది.