పారాలింపిక్స్, 2021లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు.శుక్రవారం బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోనాథన్ ఎడ్‌వర్డ్స్ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్ కుమార్ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక పోలాండ్‌కు చెందిన మసీజ్ లెపియాటోకు బ్రోన్జ్ మెడల్ దక్కింది. ప్రవీణ్ సాధించిన విజయంతో ఈ పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 11కు చేరింది.
ప్రవీణ్ పుట్టినప్పటి నుంచి ఒక కాలు పొడవు మరొక కాలు పొడవు కన్నా తక్కువగా ఉంది. ఆయన బాల్యం నుంచి క్రీడలపట్ల ఆసక్తిని ప్రదర్శించేవాడు. వాలీబాల్ ఆడటాన్ని మొదట్లో ఇష్టపడేవాడు. ఒకసారి శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారితో కలిసి హై జంప్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అప్పుడు శారీరక సామర్థ్య లోపాలుగలవారికి కూడా ప్రత్యేకంగా క్రీడా పోటీలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆయనకు డాక్టర్ సత్యపాల్ సింగ్ శిక్షణ ఇచ్చారు. ఆయన దుబాయ్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్ FAZZA Grand Prix 2021లో బంగారు పతకం సాధించి, ఆసియా రికార్డు సృష్టించాడు.