క్రికెట్ కు ప్రవీణ్ కుమార్‌ గుడ్ బై

258
Praveen Kumar
- Advertisement -

టీమిండియా పేస్ బౌలర్‌ ప్రవీణ్ కుమార్‌ క్రికెట్‌ గుడ్ బై చెప్పారు. ఉత్తర ప్రదేశ్ తరపున రంజీల్లో ప్రాతినిధ్యం వహించిన ప్రవీణ్…తన స్వింగ్‌ బౌలింగ్‌తో సత్తాచాటాడు. 2005-06 రంజీ సీజన్లో 41 వికెట్లు తీయడంతోపాటు 386 పరుగులు సాధించాడు. ఉత్తరప్రదేశ్ తరఫున క్రికెట్ ఆడితే యువ ఆటగాళ్ల అవకాశాలు దెబ్బతింటాయి. అందుకే దేశవాళీ క్రికెట్ కూడా ఆడనని ప్రవీణ్ కుమార్ తెలిపాడు.

2007లో నాగ్‌పూర్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన ప్రవీణ్ టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరపున 68 వన్డేలు,ఆరు టెస్టులు ఆడిన ప్రవీణ్..వన్డేల్లో 77,టెస్టుల్లో 27 వికెట్లు తీశాడు.

2012 మార్చి 30న చివరిసారిగా దక్షిణాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. 2011 వరల్డ్ కప్‌లో ఆడిన భారత జట్టుకు కూడా ప్రవీణ్ ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా ప్రపంచ కప్ ఆడే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. క్రికెట్ మక్కా లార్డ్స్‌ హానర్స్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్న 18వ భారత క్రికెటర్‌గా నిలిచాడు.

- Advertisement -