సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ కనిపించగా తండ్రి పాత్రలో నటిస్తోన్న సత్యరాజ్.. పోస్టర్‌లో చిన్న పిల్లాడిలా చిందులేస్తున్నారు. వర్షంలో గొడుగును గాల్లోకి ఎగరేసి నీటిలో గెంతుతున్నారు. వెనకే తేజూ జాగ్రత్త అన్నట్టుగా తండ్రి ఉత్సాహాన్ని నవ్వుతూ ఆస్వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫీల్ గుడ్ ఇంప్రషన్‌ను కలిగించింది.
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.