భుటాన్‌లో విరాట్‌ @ 31

503
- Advertisement -

అతనో రన్‌ మిషిన్‌…ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌..క్రికెట్ ప్రపంచానికి అతనో అద్భుతం…రికార్డుల రారాజుగా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. నేటితో 31వ ఏట ప్రవేశించాడు. తన జీవితంలోని ఈ అద్భుతమైన రోజును సంతోషంగా గడపడానికి భార్య అనుష్క శర్మతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ప్రకృతి అందాల మధ్య భుటాన్‌లో బర్త్‌డే వేడుకలను జరుపుకుంటున్నాడు కోహ్లీ.

1988, నవంబరు 5న ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ 2008లో టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడాడు. వచ్చిన ఏడాదిలోనే తిరుగులేని బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన విరాట్.. తిరుగులేని ఫామ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు.

kohli

వన్డేల్లో 43, టెస్టుల్లో 26 శతకాలు సాధించి.. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని బద్దలు కొట్టగల సామర్థ్యం ఉన్న ఏకైక ఆటగాడిగా ఇమేజ్ సంపాదించాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా భారత కెప్టెన్‌గానూ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో టీమిండియాకి అత్యధిక విజయాల్ని అందించిన కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. వన్డే, టీ20ల్లోనూ జట్టుని ముందుండి విజయవంతంగా నడిపిస్తున్నాడు.

kohli

ఇప్పటివరకు 82 టెస్టులు ఆడిన కోహ్లీ 26 సెంచరీలు,22 హాఫ్ సెంచరీలతో 7,066 పరుగులు చేశాడు. 239 వన్డేలు ఆడిన కోహ్లీ 43 సెంచరీలు,54 హాఫ్ సెంచరీలతో 11,520 పరుగులు చేశాడు. ఇక 71 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 22 హాఫ్ సెంచరీలతో 2,441 పరుగులు చేశాడు. టెస్టుల్లో 254 పరుగులతో డబుల్‌ సెంచరీ సాధించిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక స్కోరు 183.

 

kohli

- Advertisement -