ప్రతి ఒక్కరూ విమానాల్లో ప్రయాణించాలి:మోదీ

20
- Advertisement -

హవాయి చెప్పులు వేసుకున్న ప్రతిఒక్కరూ విమానాల్లో ప్రయాణించడమే తమ సంకల్పమని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దేశంలో పౌర విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందన్నారు. రానున్న రోజుల్లో భారత్‌కు వేలాది విమానాల అవసరం ఉంటుందని తెలిపారు. మేడ్‌ ఇన్ ఇండియా ప్రయాణికుల విమానాలు అందుబాటులోకి వచ్చే రోజూ ఎంతో దూరంలో లేదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఆ పార్టీ హయాంలో కంపెనీలో అనేక కుంభకోణాలు బయటపడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మల్నాడు ప్రాంత పరిసరాల వారికి ముంబాయి చెన్నై హైదరాబాద్ ఢిల్లీ తదితర ప్రాంతాల ప్రయాణానికి ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందన్నారు. అందుకోసం రూ.450కోట్లతో ఈ విమానాశ్రయంను నిర్మించామని తెలిపారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కలల ప్రాజెక్ట్‌గా నిర్మించిన ఈ విమానాశ్రయం ఆయన 80వ జన్మదినోత్సవం రోజున ప్రారంభం కానుండటం విశేషం. ఈ కార్యక్రమంలో యడియూరప్ప రాజకీయాల్లో చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. అనంతరం బెళగావిలో 9కిలోమీటర్లు రోడ్‌షో నిర్వహించారు. ఆయనను చూసేందుకు అభిమానులకు దారిపొడవునా అభివాదం చేశారు. బెళగావిలో మోదీ రైల్వే జల్‌జీవన్ పథకాలను ప్రారంభించనున్నారు.

 

ఇవి కూడా చదవండి…

నిందితులు ఎవ్వరైనా వదలం:కేటీఆర్‌

ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖుష్బూ…

మాది కుటుంబ పాలన…కేటీఆర్

- Advertisement -