దేవాకట్ట దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా 2010లో వచ్చిన చిత్రం ‘ప్రస్థానం’. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. శర్వానంద్, సీనియర్ నటుడు సాయికుమార్‌ల నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. దర్శకుడు దేవాకట్ట బలమున్న కథాంశంతో తెరకెక్కించడంతో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మూవీలో సాయికుమార్ చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను హిందీ రీమేక్‌గా తెరకెక్కనుందని గత కొంత కాలంగా వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలపై తాజాగా ట్విట్టర్ వేదికగా పూర్తి క్లారిటీ ఇచ్చాడు తరణ్ ఆదర్శ్.
సంజయ్ దత్ ప్రొడక్షన్‌లో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ రూపొందనుందని, ఇందులో సంజయ్ దత్, అమైరా దస్తూర్, అలీ ఫాజల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారని తెలిపారు. సంజయ్ తల్లి అయిన నర్గీస్ దత్ బర్త్ యానివర్సరీ (జూన్ 1) సందర్బంగా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా హిందీలో ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటోందో చూడాలి..!
IT’S OFFICIAL… Sanjay Dutt, Ali Fazal and Amyra Dastur… Sanjay Dutt Productions' new movie #Prasthaanam to start shoot on Nargis ji's birth anniversary… Remake of Telugu film #Prasthanam… Deva Katta, who directed the original movie, will also direct the Hindi film.
— taran adarsh (@taran_adarsh) May 22, 2018