భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే:కేసీఆర్

289
kcr
- Advertisement -

కర్ణాటక సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. దేవేగౌడ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. దేవేగౌడ స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు.

దేవుడు కుమారస్వామిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆశీర్వాదంతో కుమారస్వామి ముందుకువెళ్తారన్నారు. ప్రాంతీయ పార్టీలే భవిష్యత్తులో రాజకీయాలను నిర్ధేశిస్తాయన్నారు. రేపు తనకి హైదరాబాద్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండటంతో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని..మరొకసారి తప్పకుండా బెంగళూరు వచ్చి కుమారస్వామిని కలుస్తానన్నారు.

సీఎం వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

Image may contain: 5 people, people standing

కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు,బెంగాల్ సీఎం మమతా,డీఎంకే నేత స్టాలిన్,బీఎస్పీ చీఫ్ మాయవతితో పాటు సీపీఎం నేతలు ప్రకాశ్ కరాత్,సీతారం ఏచూరి తదితరులు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బల నిరూపణ తరువాతే మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించాలని కాంగ్రెస్- జేడీఎస్‌లు నిర్ణయానికి వచ్చాయి. 34 మంది మంత్రులుగా కొలువుదీరే అవకాశం ఉండగా, ఇందులో కాంగ్రెస్‌కు 20 , జేడీఎస్‌కు 13 దక్కే అవకాశం ఉంది.

- Advertisement -