తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్‌గా, ప్రజాస్వామ్య విరుద్ధంగా సాగాయని ఆయన మండిపడ్డారు.
బిఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి, బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ సభను నడిపిందని వేముల ఆరోపించారు. 463 పేజీల కీలక బిల్లును కనీసం చర్చ లేకుండా అర్ధగంటలోనే ఆమోదించుకున్నారని విమర్శించారు.పోలీసుల వైఖరి: నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ బిఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గేటు వద్ద నిరోధించారని, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పట్ల పోలీసులు దురహంకారంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసులు రేవంత్ రెడ్డి పెయిడ్ బ్యాచ్‌లా, తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడిందన్న కాంగ్రెస్ ఆరోపణలను వేముల తిప్పికొట్టారు. కెసిఆర్ కుటుంబం 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని తేలితే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. ఒకవేళ ఆక్రమణలు నిరూపితమైతే తామంతా రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రతిపాదించినట్లుగా.. కెసిఆర్, రేవంత్ రెడ్డి కుటుంబాల ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.అవినీతిని కప్పిపుచ్చే డైవర్షన్ పాలిటిక్స్రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి ₹200 కోట్ల విలువైన భూమిని కేవలం ₹7 కోట్లకే కట్టబెట్టారని, ఈ అవినీతి బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం రకరకాల ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని వేముల ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక ‘మొఘల్ చక్రవర్తి’లా, ‘హిట్లర్’లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే దానం నాగేందర్ సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్

