రాజకీయాలకు అతీతంగా పల్లె ప్రగతి: ప్రశాంత్ రెడ్డి

148
prashanth reddy
- Advertisement -

రాజకీయాలకు అతీతంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసలు గుప్పించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రూపొందించారని చెప్పారు. నిజామాబాద్ జడ్పీ కార్యాలయంలో దాదాన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ప్రశాంత్ రెడ్డి..

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామాలను పరిశుభ్రంగా మార్చారన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ధరణి పోర్టల్‌పై ప్రజా ప్రతినిధులు రైతులకు ఆయా విషయాలపై అవగాహన కల్పించి వారు దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని కోరారు.

గ్రామాలు మండలాల్లో రోడ్ల డ్యామేజ్ పై సభ్యులు మరమ్మతులకు నిధులు కోరగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 నుంచి 30 కోట్ల రూపాయలు రహదారులకు వాటి మరమ్మతులకు మంజూరు చేశామన్నారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 95 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ సంవత్సరం 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

- Advertisement -