బెంగాల్ ఎన్నికల్లో దీదీకి మద్దతు:అఖిలేష్

39
akhilesh

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేస్తానని దీదీ ప్రకటించింది. దీదీ ప్రకటించిన కాసేపటికే బెంగాల్ ఎన్నికల్లో తాము మమతా బెనర్జీకి మద్దతిస్తామని చెప్పారు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.

విద్వేష రాజ‌కీయాల‌తో బెంగాల్‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీని ఓడించ‌డం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. ల‌క్నోలో జ‌రిగిన పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా అక్క‌డ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి అధికారంలోకి రావ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింద‌ని అఖిలేష్ యాద‌వ్ ఆరోపించారు.