చంద్రబాబును సరిహద్దులు దాటించాలి:కొడాలి నాని

40
Kodali-Nani

ఎన్టీఆర్‌ను ఇష్టపడేవారు చంద్రబాబును రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నారు వైసీసీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు కుట్రలు చేశారని విమర్శించారు.ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని….. ఎన్టీఆర్‌ పార్టీని, సీఎం హోదాను తస్కరించారని మండిపడ్డారు. పదవులు, ఓట్ల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడని అన్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి, జయంతి నాడే భారతరత్న ఇవ్వాలని బాబు కోరుతాడు. ఎన్టీఆర్‌కు భారతరత్న తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. నీచమైన పనుల్లో బాబుకు ప్రపంచరత్న ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

అఖిల ప్రియ అరెస్ట్‌పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడని ప్రశ్నించిన నాని….. దేవాలయాలపై దాడుల ఘటనలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.