ఊరమాస్‌గా నేచురల్ స్టార్‌..!

32
nani
- Advertisement -

నాని సినిమాలంటే క్లాస్‌కు పెట్టింది పేరు. తన సహజనటనతో ఇప్పటివరకు మెప్పిస్తూ వచ్చిన నాని…ఊరమాస్‌గా మారనున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా దసరా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొలిసారి మాస్‌ లుక్‌లో నాని కనిపిస్తుండగా తన నెక్ట్స్‌ ప్రాజెక్టును ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో చేయనున్నారట.

కేజీయఫ్ చిత్రాలతో సత్తాచాటిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నాని సినిమా ఉండనుందట. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే మాస్‌కు పెట్టింది పేరు. ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న సలార్‌లో సైతం మాస్‌ యాక్షన్‌తో వస్తుండగా నానికి సైతం ఓ కథను వినిపించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.

నాని ఈ సినిమాలో ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడట. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -