ఆదిపురుష్..ఈసారి నిరాశే!

87
aadipurush
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా బాలీవుడ్ దర్శకడు ఓం రావుత్ తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్, రిలీజ్ డేట్ తప్ప ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా గుర్రుగా ఉన్నారు.

ఇక శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి పండగలకైనా ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారో వేచిచూడాలి..

- Advertisement -